Toxic Teaser: యశ్ కొత్త అవతారం… హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో సంచలనం
టాక్సిక్ ‘Toxic: A Fairytale for Grown-Ups’ టీజర్ విడుదలైంది. యశ్ పూర్తిగా సరికొత్త అవతారంలో కనిపిస్తూ డార్క్ యాక్షన్ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
Toxic Teaser Out: Yash’s Bold Reinvention, A Dark Fairytale Unfolds
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
Toxic Teaser Out : దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ టాక్సిక్(Toxic: A Fairytale for Grown-Ups) టీజర్ విడుదలైంది. ‘రాకింగ్ స్టార్’ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
టీజర్‌లో కనిపించిన విజువల్స్ గ్రాండ్‌గా, హాలీవుడ్ స్థాయిలో రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. సర్కస్ నేపథ్యంలో ప్రారంభమై, తూర్పు ఆసియా శైలిలోని సెట్స్‌కు మారుతూ కథ సాగుతుంది. కాల పరిణామాలు కూడా మారుతున్నట్లుగా ఉంది. ఈ టీజర్ డార్క్, హింసాత్మక దృశ్యాలతో పాటు కథలో గాఢత ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది. కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉన్నట్లు అర్థమవుతోంది.
యశ్ పూర్తి మార్పు… కెరీర్‌లో కొత్త అధ్యాయం

ఈ చిత్రంలో యశ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఒకవైపు సన్నగా, చురుకైన రూపం… మరోవైపు భారీ శరీరాకృతి, యుద్ధానికి సిద్ధమైన వీరుడిలా కనిపించే తీరు ఆకట్టుకుంటోంది. శరీరాకృతి మాత్రమే కాకుండా, బాడీ లాంగ్వేజ్, కళ్లలోని గంభీరత, డైలాగ్ డెలివరీలోని తీవ్రత—ఇవన్నీ కలిపి ఇది అతని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తన గత చిత్రాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పాత్రగా కనిపిస్తోంది. టీజర్ చూస్తే కథ చాలా రకాలుగా, యశ్ పాత్రలో గంభీరత ఉంటుందని స్పష్టమవుతోంది.
ఐదుగురు కథానాయికలు… మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార (గంగ), కియారా అద్వానీ (నాడియా), హ్యూమా ఖురేషి (ఎలిజబెత్), రుక్మిణీ వసంత్ (మెలిస్సా), తారా సుతారియా (రెబెక్కా) పాత్రల్లో నటిస్తున్నారు.

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram