విధాత, హైదరాబాద్ : మేడ్చల్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీల శనివారం రాత్రి జరిగిన ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సౌండ్ బాక్స్ స్టాండ్ కూలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒకరికి కాళ్లు విరగగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. భద్రత నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హీరో యశ్ మాట్లాడుతుండగా, ఉత్సాహంతో కొంతమంది యువకులు సౌండ్ బాక్స్‌ల స్టాండ్‌పైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదాన్ని గమనించిన హీరో యశ్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపి, అందరూ క్షేమమేనా అని ఆరా తీశారు. అక్కడికి వెళ్లి చూడండి అంటూ, అందరూ సేఫ్ అని నిర్ధారించుకునే వరకు స్పీచ్‌ను ఆపేసిన ఆపేశాడు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతార, కియారా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి టాక్సిక్ సినిమా ఫ్రీ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. యశ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది విద్యార్థులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.హీరో యశ్ మాట్లాడుతుండగా..ఆయనను చూసేందుకు కొందరు ఉత్సాహంతో వేదిక సమీపంలో అమర్చిన భారీ సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ నిర్మాణాలపైకి ఎక్కారు. విద్యార్థుల బరువును తట్టుకోలేక ఆ సౌండ్ సిస్టమ్ అమర్చిన ఫ్రేమ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.
ఈ ఘటనతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీ సంఖ్యలో అభిమానులు ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. విద్యార్ధులు సరిగా ప్రవర్తించకపోతే ఇకముందు యూనివర్సిటీలో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించబోమంటూ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వేదిక మీద నుంచి ప్రకటించారు. విద్యార్ధులు క్రమశిక్షణతో వ్యహరించాలని కోరారు. అంతకుముందు మల్లారెడ్డి తనదైన శైలీలో ప్రసంగిస్తూ..విద్యార్ధులను, సినిమా యూనిట్ ను అలరించారు.
🚨 టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగినప్పటి సన్నివేశం https://t.co/LuNNW9vVsG pic.twitter.com/GrdZvmuqYS
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 23, 2026