విధాత, హైదరాబాద్ : మేడ్చల్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీల జరిగిన ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సౌండ్ బాక్స్ స్టాండ్ కూలడంతో విద్యార్ధులకు తీవ్ర గాయలవ్వడం..యూనివర్సిటీ, ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదవ్వడం తెలిసిందే. హీరో యశ్ మాట్లాడుతుండగా, ఉత్సాహంతో కొంతమంది యువకులు సౌండ్ బాక్స్‌ల స్టాండ్‌పైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదాన్ని గమనించిన హీరో యశ్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపి, అందరూ క్షేమమేనా అని ఆరా తీశారు. అక్కడికి వెళ్లి చూడండి అంటూ, అందరూ సేఫ్ అని నిర్ధారించుకునే వరకు స్పీచ్‌ను ఆపేశాడు.
అయితే ఈ ఘటన సందర్బంగా వేదిక పై నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం ప్రీతిరెడ్డి మాట్లాడుతూ..ఈవెంట్ జరుగుతున్న సమయంలో విద్యార్ధుల ప్రవర్తన సరిగా లేదని, ఇలాగైతే మళ్లీ ఇలాంటి ఈవెంట్లు మన క్యాంపస్ లో జరుగవని, మీ ప్రవర్తన సక్రమంగా ఉంటేనే ఇలాంటి ఈవెంట్లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు మాటల తూటాలు సంధిస్తున్నారు. టాక్సిక్ వంటి ఏ సర్టిఫికెట్ సినిమాల ఈవెంట్లు పెట్టి, హీరోలు, హీరోయిన్లను తీసుకొచ్చి యూనివర్సిటీ విద్యార్ధులను ఎటు తీసుకపోతున్నారంటూ నిలదీస్తున్నారు. అసలు యూనివర్సిటీలో సినిమా ఈవెంట్లు ఎందుకని, మళ్ళీ పెట్టక పోతే ఎవరికీ నష్టం? మీదికెళ్లి విద్యార్ధులనే బెదిరిస్తున్నారు ? అంటూ మండిపడుతున్నారు. పిల్లలకు 4 మంచి కంపెనీలు తీసుకరండి, మంచి ప్రొఫెసర్ లను రిక్రూట్ చేసుకోండి..నాణ్యమైన ప్రమాణాలతో ఆహారం, విద్యాబోధన అందించండి..అంతేగాని సినిమా ఈవెంట్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులకు కావాల్సింది..క్యాంపస్ సెలక్షన్స్, రిక్రూట్మెంట్స్, ప్లేస్ మెంట్స్ గాని..సినిమా ఈవెంట్లు కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి ఈవెంట్ లు ఎందుకు ? @drpreetireddy మళ్ళీ పెట్టక పోతే ఎవరికీ నష్టం? ఇంకా బెదిరిస్తున్నారు మళ్ళీ?
పిల్లలకు 4 మంచి కంపెనీ లు తీసుకురండి, మంచి ప్రొఫెసర్ లను రిక్రూట్ చేసుకోండి.
నాకు తెలిసినోడు ఒకడు బాగా పడలే వీళ్ళ కాలేజీ లో సదవుకొని 🤧#Toxic pic.twitter.com/m1rAT9mctS
— Indian (@DatlaK_V) August 23, 2026