ఏపీ శాసన మండలిలో తిరుమల శ్రీవారి ఫోటోల రగడ !

ఏపీ శాసన మండలిలో శ్రీవారి ఫోటోలతో వైసీపీ నిరసన రగడగా మారింది. ఇందాపూర్ డెయిరీ, లడ్డూ కల్తీ అంశాలపై చర్చ కోరగా సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 20, 2026, 12:33 pm IST
Read Time: 4 mins
ఏపీ శాసన మండలిలో తిరుమల శ్రీవారి ఫోటోల రగడ !

అమరావతి : ఏపీ శాసన మండలిలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడం తీవ్ర రగడకు దారితీసింది. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైసీపీ సభ్యులు రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ కొయ్యొ మోషేను రాజు తిరస్కరించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ .. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఇందాపూర్‌ డెయిరీపై చర్చించాలని సభలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు.

వేంకటేశ్వరస్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడిని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు బుద్ధుందా? .. దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలను అనుమతించకూడదు అంటూ మండలి చైర్మన్ ను కోరారు. ఓ దశలో మంత్రి పయ్యావు మండ‌లిలో తన ఇయర్ ఫోన్స్ విసిరికొట్టి అసనం వ్యక్తం చేశారు. దేవుడంటే వైసీపీ సభ్యులకు భయం, నమ్మకం లేవన్నారు. చట్ట సభలో వైసీపీ సభ్యులు శ్రీవారి ఫోటోల ప్రదర్శలనలతో మహాపచారానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో వైసీపీ నేతలు సభకు వచ్చి మహాపచారం చేశారంటూ మంత్రులు, కూటమి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

Garbage Girl | నేను చెత్తను ఎంచుకోలేదు.. అదే నన్ను ఎంచుకుంది.. ఇండియ‌న్‌ గార్బేజ్ గ‌ర్ల్ స్ఫూర్తిదాయకమైన కథ
T20 World Cup Super 8 Explainer | టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఎనిమిది జట్లు… పూర్తి షెడ్యూల్ ఇదే!