లోకేశ్ ..నీది జగన్‌తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్

లక్ష్మీపార్వతి మంత్రి నారా లోకేశ్ పై మండిపడి, జగన్‌తో పోల్చుకునే స్థాయి నీది కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

లోకేశ్ ..నీది జగన్‌తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్

అమరావతి : వైఎస్. జగన్ తో పోల్చుకునే స్థాయి నీది కాదు అని మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. మీ నాన్న కుట్రతో జగన్ ను జైలుకు పంపితే..16 నెలలు జైలులో ఉండి, ఒంటరిగా పోరాడి అధికారంలోకి వచ్చిన జగన్ ఎక్కడ?.. అడ్డదారిలో ఈవీఎంలతో గెలిచిన నీవు ఎక్కడ? అంటూ లక్ష్మీ పార్వతీ సెటైర్లు వేశారు. నీవు వైఎస్. విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి..జగన్ ఏదో వాళ్ల అమ్మను, చెల్లిని ప్రేమించనట్లుగా..నీవే నీ కుటుంబాన్ని ప్రేమించేవాడిగా బిల్డప్ లు ఇవ్వడం ఎందుకని? ఎవరిని మోసం చేయడానికి? అని ప్రశ్నించారు.

అసలు ఏనాడైన మీ నాన్న చంద్రబాబు నీ మేనత్తలను ఇంటికి తీసుకొచ్చాడా అని, పెళ్లైన కొత్తలో అప్పటికే మంత్రిగా ఉన్న మీ నాన్న తోబుట్టువుల ఇంటికి వెళ్లాలంటే కూడా అర్ధరాత్రి దొంగచాటుగా వెళ్లేవాడని.. అలాంటి మీరు జగన్ కుటుంబం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సోదరిమణులను పేదవాళ్లని చెప్పి వారిని భువనేశ్వరీ దూరం పెట్టిందని, ఒక్క రోజైనా భోజనానికి పిలవలేదని, ఆడపడుచులు అని గౌరవ మర్యాదలు చేయలేదని, ఇప్పుడు గురివింద గింజ మాదిరిగా జగన్ కుటుంబం గురించి మీరు మాట్లాడటం హాస్యస్పదం అని లక్ష్మీపార్వతి విమర్శించారు. ముఖ్యమంత్రి కావడానికి లోకేశ్.. కొడుకును ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలలో భాగంగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చిందే చంద్రబాబు అని, నారా లోకేశ్ కు పెద్దలంటే అంత గౌరవం ఉంటే వాళ్ల అమ్మమ్మ అయిన నేను బ్రతికే ఉన్నానుగా.. ఎప్పుడైనా నాకు శుభాకాంక్షలు చెప్పాడా? అసలు నా పుట్టినరోజు తెలుసా? అంటూ నిలదీశారు. చంద్రబాబు, లోకేశ్ ల వ్యవహారం అంతా నాటకీయం, రాజకీయమేనని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?
‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్