‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్

సాధ్వి సతీశ్ సైల్ ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుని, మిస్ వరల్డ్ 2027లో భారత్ తరఫున పోటీపడే అవకాశం పొందారు.

‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్

విధాత : గోవా బ్యూటీ సాధ్వి సతీశ్ సైల్ ‘ఫెమినా మిస్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. పోటీలో మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ ప్రథమ రన్నరప్‌గా నిలవగా, కేంద్ర పాలిత ప్రాంతాల (సమిష్టిగా) తరపున ప్రాతినిధ్యం వహించిన జమ్మూకశ్మీర్ కు చెందిన తెలుగు తమిళ మూలాలున్న శ్రీ అద్వైత ద్వితీయ రన్నరప్‌గా నిలిచారు.

‘పుత్రికాభిమానం’ థీమ్ తో నిర్వహించిన 61వ ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలలో విజేతగా నిలిచిన సాధ్వి సైల్ త్వరలో జరుగబోయే 75వ ‘మిస్ వరల్డ్ 2027’ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది విజేత నికితా పోర్వాల్.. సాధ్వికి మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించారు. మోడల్ గా పనిచేస్తున్న సాధ్వి సతీశ్ సైల్ సామాజిక సేవలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బాలలు, ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేసే సంస్థల కోసం నిధులు సేకరించడంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఆమె 7 భాషాలలో మాట్లాడగలడం విశేషం.

ఈ పోటీలో సాధ్వి సిల్వర్, బ్లాక్ కలర్ మోనోక్రోమాటిక్ గౌనులో మెరిసిపోయారు. ఆమె దుస్తులు వినూత్నంగా ఉన్నాయి. హై-నెక్, స్లీవ్‌లెస్ కట్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజనందిని పింక్ కలర్ గౌనులో ‘మోడ్రన్ ప్రిన్సెస్’లా కనిపించారు. వెండి స్పటికాలు, రాళ్లతో అలంకరించిన ఆమె హాల్టర్-స్టైల్ గౌను, హెయిర్ స్టైల్ క్లాసిక్ లుక్‌ను అందించాయి. సెకండ్ రన్నరప్ శ్రీ అద్వైత నిలిచారు. శ్రీ అద్వైత గోల్డ్ కల్లర్ ఈవినింగ్ గౌనులో తళతళలాడారు. ఆమె లుక్‌కు సిల్వర్ ఇయర్ రింగ్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందం, తెలివితేటలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఈ ముగ్గురు భామలు నేటి యువతులకు స్ఫూర్తిగా నిలిచారు.

ఇవి కూడా చదవండి :

టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
అమెరికా – ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!