Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం నాడు కురిసిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, యాద్రాద్రి భువనగిరి, సిద్ధిపేట, మహబూబా బాద్ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
విధాత :
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం నాడు కురిసిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, యాద్రాద్రి భువనగిరి, సిద్ధిపేట, మహబూబా బాద్ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో ముందస్తుగానే ఆయా జిల్లా కలెక్టర్లు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు గురువారం నాడు సెలవు ఉండనుంది. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అలాగే, భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటతో పాటు, ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో అత్యధికంగా 36.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దింది ప్రాజెక్టు నిండుకుండలా మారండంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించిన అధికారులు. అలాగే, ఉత్తర వాయువ్యంగా కదిలి మొంథా తుఫాను క్రమేన బలహీన పడుతుందని.. దీంతో రాగల 10 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram