• Telugu News
  • /National

Rs 49 Cr In Abu Dhabi Big Ticket : కుమార్తె రూపంలో వ‌రించిన అదృష్టం.. లాట‌రీలో రూ.49 కోట్లు గెలుచుకున్న క‌ర్ణాట‌క‌ యువ‌కుడు

కర్ణాటకకు చెందిన యువకుడు అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.49 కోట్లు గెలుచుకున్నాడు. కుమార్తె చెప్పిన నంబర్‌తో టికెట్ కొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 06, 2026, 12:23 pm IST
Read Time: 4 mins
Rs 49 Cr In Abu Dhabi Big Ticket : కుమార్తె రూపంలో వ‌రించిన అదృష్టం.. లాట‌రీలో రూ.49 కోట్లు గెలుచుకున్న క‌ర్ణాట‌క‌ యువ‌కుడు

ప్ర‌స్తుతం చాలా మంది లాట‌రీ (Lottery) టికెట్లు కొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. టికెట్ కొనేందుకు డ‌బ్బు లేక‌పోయినా.. అప్పు చేసైనా స‌రే లాట‌రీ టికెట్ కొంటున్నారు. అలా అదృష్ట‌దేవ‌త తలుపుత‌ట్ట‌క‌పోనా అని ఎదురుచూస్తున్నారు. అలా తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ఓ యువ‌కుడు లాట‌రీ ద్వారా జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు.

ఉడుపి (Udupi) జిల్లా కటపాడి మట్టు ప్రాంతానికి చెందిన శాంతను శెట్టిగార్ (Shanthanu Shettigar).. ప్ర‌స్తుతం గ‌ల్ఫ్ దేశం ఒమన్‌లో ఉంటున్నాడు. అత‌డికి లాట‌రీ టికెట్లు కొనే అల‌వాటు ఉంది. గ‌త ఐదేళ్లుగా లాట‌రీ టికెట్ల ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. కానీ ఒక్క‌సారి కూడా అదృష్ట‌దేవ‌త త‌లుపుత‌ట్ట‌లేదు. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరిగిన ప్ర‌తిష్టాత్మ‌క అబుదాబి బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రాలో (Abu Dhabi Big Ticket lucky draw) అత‌డు విజేత‌గా నిలిచాడు.

రూ.49 కోట్ల జాక్‌పాట్‌..

శాంత‌ను త‌న ఫ్రెండ్‌తో క‌లిసి రూ.12,000తో ఆన్‌లైన్ ద్వారా లాట‌రీ టికెట్ కొనుగోలు చేశారు. 283వ సీరియల్‌ టికెట్‌ నంబరు 305810 లాటరీని కొనుగోలు చేశాడు. అబుదాబిలో ఈ నెల 3న తీసిన లక్కీ డ్రాలో శాంత‌ను విన్న‌ర్‌గా నిలిచారు. అత‌డు ఏకంగా 20 మిలియ‌న్ దిర్హామ్స్ గెలుచుకున్నాడు. అంటే భార‌త క‌రెన్సీలో రూ.49 కోట్ల‌న్న మాట‌.

కుమార్తె రూపంలో అదృష్టం

అత‌డికి ఈ అదృష్టం కుమార్తె రూపంలో వ‌రించ‌డం మ‌రో విశేషం. లాట‌రీ టికెట్ కొనే ముందు శాంత‌ను త‌న కుమార్తెను ఏ నంబ‌ర్ టికెట్ తీసుకోవాల‌ని అడిగాడ‌ట‌. చిన్నారి చెప్పిన నంబ‌ర్‌నే శాంత‌ను కొనుగోలు చేశాడు. అలా కుమార్తె రూపంలో అత‌డికి అదృష్టం వ‌రించింది మ‌రి. ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

Student Misbehaves With Teacher : న‌డిరోడ్డుపై టీచ‌ర్ పెద‌వి కొరికిన విద్యార్థి.. షాకింగ్ వీడియో
Rajamouli | ‘వారణాసి’పై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. టెంటు వేసుకొని థియేట‌ర్ల బ‌య‌ట ధ‌ర్నా చేస్తాను..