Rajamouli | ‘వారణాసి’పై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. టెంటు వేసుకొని థియేటర్ల బయట ధర్నా చేస్తాను..
Rajamouli | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగానే భారీ ప్రమోషన్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది.
Rajamouli | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగానే భారీ ప్రమోషన్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమా పూర్తయ్యాకే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యే పరిస్థితుల్లో, షూటింగ్ మధ్యలోనే హాలీవుడ్ మీడియాతో చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇవ్వడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.
ఇంటర్వ్యూలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఈ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఆలోచించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని సింగిల్ పార్ట్‌గా విడుదల చేయాలని ఫైనల్ చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. దాదాపు మూడు గంటల రన్‌టైమ్‌తో 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఒక్క భాగంగానే ప్రేక్షకుల ముందుకు రానుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. మహేశ్ బాబు మాట్లాడుతూ రాజమౌళితో సినిమా చేయడం మొదట్లో కొంత భయాన్ని కలిగించిందని అన్నారు.
ఈ కాంబినేషన్ దాదాపు 15 ఏళ్ల క్రితమే సెట్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు. కథ వినేందుకు రాజమౌళి ఆఫీసుకు పిలిచినప్పుడు ఈ సినిమా ఆయన గత చిత్రాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని అర్థమైందన్నారు. యాక్షన్, డ్రామా, అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ వంటి విభిన్న జానర్ల మేళవింపుతో కథ రూపుదిద్దుకుందని తెలిపారు. అయితే వారణాసి సినిమాను కచ్చితంగా ఐమ్యాక్స్ థియేటర్లోనే విడుదల చేస్తానని రాజమౌళి బహిరంగంగా ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ భారత్‌లో 2027 నాటికి ఐమ్యాక్స్‌లు అందుబాటులోకి రాకపోతే ఏం చేస్తారు? అని యాంకర్ దర్శకుడిని ప్రశ్నించగా, “ఇండియాలో మాకు ఒక ఆప్షన్ ఉంది. అనుకున్నది జరగకపోతే ఆఫీసుల ముందు ధర్నా చేయవచ్చు. నా సినిమా రిలీజ్ సమయానికి ఐమ్యాక్స్ ఫార్మాట్ రాకపోతే నేను కూడా టెంట్ వేసుకుని థియేటర్ల బయట థర్నా చేస్తాను” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఈ సినిమాలో మహేశ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని కూడా వెల్లడించారు. ముఖ్యంగా రాముడి పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్రకు అవసరమైన హుందాతనం, నడక, శరీర భాష కోసం నెలల తరబడి రిహార్సల్స్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక తన ప్రత్యేక రన్నింగ్ స్టైల్‌ను కూడా ఈ సినిమా కోసం మార్చుకుని పర్ఫెక్ట్ కావడానికి దాదాపు ఆరు నెలలు కష్టపడ్డానని తెలిపారు.
ఇంటర్వ్యూలో భాగంగా తమ కెరీర్‌ను మార్చిన చిత్రాల గురించి కూడా నటీనటులు ప్రస్తావించారు. మహేశ్ బాబు తన కెరీర్‌కు ‘పోకిరి’ సినిమా మలుపుతిప్పిందని పేర్కొనగా, ప్రియాంక చోప్రా ‘బర్ఫీ’ చిత్రాన్ని తనకు అత్యంత ఛాలెంజింగ్ పాత్రగా అభివర్ణించారు. పృథ్వీరాజ్ తనకు ‘గోట్ లైఫ్’ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని వెల్లడించారు.
ఇక ‘వారణాసి’ని తప్పనిసరిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనే విడుదల చేస్తామని రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేశారు. 2027 నాటికి భారతదేశంలో ఐమ్యాక్స్ సౌకర్యాలు అందుబాటులో లేకపోతే ఏమి చేస్తారు అన్న ప్రశ్నకు ఆయన సరదాగా స్పందిస్తూ, “అలా అయితే థియేటర్ల ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తాను” అంటూ నవ్వులు పూయించారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరిగి, సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram