Trisha | మహేష్ బాబు డెడికేషన్‌పై త్రిష ప్రశంసలు.. ఆయన ప్రత్యేకత ఇదేనంటూ కామెంట్
Trisha | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి హీరోయిన్ త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష, మహేష్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ ఆయన వ్యక్తిత్వం, పనిపట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
Trisha | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి హీరోయిన్ త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష, మహేష్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ ఆయన వ్యక్తిత్వం, పనిపట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
మహేష్ బాబు తన అభిమాన నటులలో ఒకరని చెప్పిన త్రిష, ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు. ముఖ్యంగా ఒక కళాకారిణిగా తనను గౌరవించిన తీరు తనకు చాలా నచ్చిందని చెప్పారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోల నుంచి అలాంటి గౌరవం అందరికీ దక్కకపోవచ్చని, కానీ మహేష్ మాత్రం ప్రతి సహనటుడిని గౌరవిస్తారని ఆమె పేర్కొన్నారు.
చాలా మందికి తెలియనిది ఏంటంటే..
అలాగే మహేష్ బాబు గురించి చాలా మందికి తెలియని విషయాన్ని కూడా త్రిష వెల్లడించారు. మహేష్ తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడపడం వల్ల, కాలేజీ రోజుల నుంచే తనకు పరిచయం ఉందని చెప్పారు. పరస్పర స్నేహితుల ద్వారా అప్పట్లో ఒకరికొకరు తెలిసినా, భవిష్యత్తులో ఇద్దరూ సినీ పరిశ్రమలోకి వచ్చి కలిసి సినిమాలు చేస్తామని ఎప్పుడూ ఊహించలేదని గుర్తు చేసుకున్నారు.
షూటింగ్ సమయంలో మహేష్ చూపించే క్రమశిక్షణ గురించి కూడా త్రిష ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కఠినమైన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తాను అలసిపోయి వెళ్లిపోవాలనుకునేదాన్నని, కానీ మహేష్ మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు సెట్‌లోనే ఉండి తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టేవారని తెలిపారు.
ఆయన ప్రత్యేకత ఇదే..
మహేష్ ఎప్పుడూ తన వానిటీ వ్యాన్‌లో ఎక్కువ సమయం గడపరని, తన సన్నివేశం కాకపోయినా ఇతర నటుల సన్నివేశాలను కూడా మానిటర్ ముందు కూర్చుని గమనిస్తుంటారని చెప్పారు. తోటి నటుల పనిలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా, వారిని వారి శైలిలో నటించనివ్వడం ఆయన ప్రత్యేకత అని త్రిష పేర్కొన్నారు.
వీరిద్దరూ కలిసి నటించిన అతడు, సైనికుడు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రొఫెషనలిజం, పనిపట్ల ఉన్న నిబద్ధత గురించి త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram