• Telugu News
  • /National

Student Misbehaves With Teacher : న‌డిరోడ్డుపై టీచ‌ర్ పెద‌వి కొరికిన విద్యార్థి.. షాకింగ్ వీడియో

ఉత్తరప్రదేశ్ మైన్పురిలో షాకింగ్ ఘటన. నడిరోడ్డుపై మహిళా టీచర్‌పై దాడి చేసిన 12వ తరగతి విద్యార్థి పెదవిని కొరికాడు. ఘటన వీడియో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 06, 2026, 12:11 pm IST
Read Time: 5 mins
Student Misbehaves With Teacher : న‌డిరోడ్డుపై టీచ‌ర్ పెద‌వి కొరికిన విద్యార్థి.. షాకింగ్ వీడియో

దేశంలో మ‌హిళ‌ల‌పై వేధింపులు పెరిగిపోతున్నాయి. చిన్న‌పిల్ల‌ల నుంచి వృద్ధులు ఏదో ఒక రూపంలో లైంగికంగా వేధింపులు, దాడుల‌కు గుర‌వుతున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళా టీచ‌ర్‌ (Female Teacher)ను ఓ విద్యార్థి న‌డిరోడ్డుపై వేధింపుల‌కు గురి చేశాడు. ఆమెపై దాడి చేసి పెద‌వి కొరికాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

న‌డిరోడ్డుపై అడ్డుకుని..

యూపీలోని మెయిన్‌పురి (Mainpuri)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థి (Class 12 Student).. టీచ‌ర్‌ను గ‌త కొన్ని రోజులుగా వేధింపుల‌కు గురిచేస్తున్నాడు. వేధింపుల‌కు విసిగిపోయిన టీచ‌ర్‌.. విద్యార్థి త‌ల్లిదండ్రుల‌కు ఫిర్యాదు చేసింది. అయినా అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. ఇక ఇటీవ‌లే ఆమె ట్యూష‌న్ క్లాస్‌లు చెప్పేందుకు వెళ్తుండ‌గా.. ఆ విద్యార్థి ఆమెను న‌డిరోడ్డుపై అడ్డుకున్నాడు.

పెదాల‌పై కొరికి…

న‌డిరోడ్డుపై అంద‌రూ ఊస్తుండ‌గానే భుజంపై చేతులు వేస్తూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అనంత‌రం ఆమె పెదాలపై గ‌ట్టిగా కొరికాడు. అత‌డి దాడిలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. పెదాల నుంచి రక్తం ధారగా కారింది. నొప్పితో బాధ‌ప‌డుతున్న టీచ‌ర్‌ని స్థానికులు చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రికి తర‌లించారు. అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆగ్రా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. టీచ‌ర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నెటిజ‌న్లు ఫైర్‌

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఉపాధ్యాయురాలి ప‌ట్ల విద్యార్థి ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఫైర్ అవుతున్నారు. నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌ద‌రు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

 

ఇవి కూడా చదవండి :

Kavitha | 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ : కవిత
Chhattisgarh encounter| చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు, కమెండో మృతి