ఉత్తరప్రదేశ్ రుద్రపూర్‌లో ముగ్గురు నిందితులు ఓ యువతి(19)ని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని భూరారాణి రోడ్డు సమీపంలోని ఒక అడవికి తీసుకెళ్లి, ముగ్గురు నిందితులు గుర్బాజ్ అలియాస్ మను, జోగా సింగ్, రవీందర్ లు అమెపై లైంగిక దాడికి పాల్పడి కొట్టి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితులని గుర్తించి పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అనూహ్యంగా నిందితులు కాల్పులు జరుపడం సంచలనం రేపింది. అయితే పోలీసులూ ఎదురుకాల్పులు జరిపి.. చివరికి ఆ ముగ్గురిని ఆ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒక నిందితుడి కాలికి గాయాలయ్యాయి.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితులలో ఇద్దరిని పోలీసులు సీన్ రీక్రియేషన్‌కు తీసుకెళ్లగా.. వారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి నిందితులను వెంబడించి పట్టుకున్నారు. వారికి దొరికిన చోటనే అక్కడికక్కడే దేహశుద్ధి రోడ్ల మీదుగా కొట్టుకుంటు తీసుకెళ్లారు. యూపీలో నేరాల నియంత్రణకు సీఎం యోగి ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి తరుచూ దారుణ నేరాలు వెలుగు చూస్తుండటం విమర్శలకు తావిస్తుంది.
A 19-year-old girl was abducted and gang-raped by 3 youths in Rudrapur, Uttarakhand.
Police arrived to arrest them; the accused fired in retaliation and cops shot one in the leg and arrested all three.
Next day, during crime scene recreation, two of them fled custody — but…
— Gaurav (@k_gauravs) July 28, 2026