RBI| ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం !
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RB) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లుగా ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లుగా తెలిపారు.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RB) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లుగా ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లుగా తెలిపారు. ఈ సారి రేపో రేటులో ఎలాంటి మార్పు లేది, 5.25శాతం వద్దే రేపోరేటును కొననసాగించనున్నట్లుగా వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటన తర్వాతా ఆర్బీష తొలి త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది.
గతేడాది ఈ వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు సవరించిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25బేసిస్ పాయింట్ల మేర తగ్గించి, జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబరులో మరో 25 శాతం తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ధఫా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లుగా పేర్కొనడం ఆసక్తికరం.
సానుకూల దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని, ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సానుకూల దిశగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా వెల్లడించారు. ఇటీవల కుదిరిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, త్వరలో జరగనున్న భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. దేశీయ వృద్ధిని మరింత బలోపేతం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో 6.9శాతం, రెండో త్రైమాసికంలో 7శాతం వృద్ధి నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నాం అని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1శాతంగా ఉండొచ్చని, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4శాతం, రెండో త్రైమాసికంలో 4.2శాతం ద్రవ్యోల్బణం నమోదవ్వొచ్చు అని అంచనా వేశారు. జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, వ్యవస్థలో ద్రవ్య లభ్యత రోజువారీ సగటున రూ.75వేల కోట్లుగా ఉందని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram