Chandrababu Naidu : మొంథా తుపాన్ ఫైటర్లకు చంద్రబాబు ఉత్తమ సేవా సర్టిఫికెట్లు
మొంథా తుపాన్ సేవల్లో ప్రతిభ కనబరిచిన 175 మందిని సీఎం చంద్రబాబు ‘సైక్లోన్ ఫైటర్స్’గా గౌరవించి ఉత్తమ సేవా సర్టిఫికెట్లు అందించారు.
అమరావతి : మొంథా తుపాన్ను ఎదుర్కునే క్రమంలో ఉత్తమ సేవలందించిన వారిని సైక్లోన్ మెుంథా ఫైటర్లుగా గుర్తించి గౌరవిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు వారికి సర్టిఫికెట్లు, మోమోంటోలను అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో తుపాన్ విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మోమోంటోలు అందచేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి రెండు సమస్యలు ఉన్నాయని..ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు అని గుర్తు చేశారు. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశాం అన్నారు. గతంలో హరికేన్ తుపాన్ వచ్చిన సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగాం అని తెలిపారు.
ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ను సిద్ధం చేశాం అని, వారంతా అద్భుతంగా పనిచేశారని..వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం అని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ.., ఇలా 5 పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించాం అని చంద్రబాబు తెలిపారు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపించాం అని, వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశాం అన్నారు. దీంతో అతి పెద్ద తుఫాన్‌ను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశాం అని చంద్రబాబు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram