MSG | బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్.. ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం

MSG | మెగాస్టార్ చిరంజీవి పేరు పడితే చాలు.. బాక్సాఫీస్ వద్ద అంచనాలు మారిపోతాయి. తాజాగా అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దేశవిదేశాల్లో కలెక్షన్ల మోత మోగిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

  • By: sn |    movies |    Published on : Jan 29, 2026 2:34 PM IST
MSG | బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్.. ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం

MSG | మెగాస్టార్ చిరంజీవి పేరు పడితే చాలు.. బాక్సాఫీస్ వద్ద అంచనాలు మారిపోతాయి. తాజాగా అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దేశవిదేశాల్లో కలెక్షన్ల మోత మోగిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజులలోనే మెగాస్టార్ బాక్సాఫీస్ బాస్‌గా నిలిచారు. చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.350 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓవర్సీస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా

దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సత్తా చాటుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది దాదాపు రూ.41 కోట్లకు సమానం కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్‌లో 4.5 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ను థియేటర్లలో అనుభవించండి అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు మెగా అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

అనిల్ రావిపూడి కెరీర్‌లో మరో మైలురాయి

ఇప్పటికే రీజినల్ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచింది. ఈ మూవీతో దర్శకుడు అనిల్ రావిపూడి తన కెరీర్‌లో మరో రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అనిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రేడ్ అంచనాల ప్రకారం, త్వరలోనే ఈ సినిమా విదేశాల్లో 5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయం

ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకులను అన్ని వర్గాల్లోనూ ఆకట్టుకుంటోంది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. నయనతార కీలక పాత్రలో మెప్పించగా, విక్టరీ వెంకటేశ్, కేథరీన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భారీ నిర్మాణ విలువలు, పండుగ సీజన్‌కు తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు సినిమాను బ్లాక్‌బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.

కథాంశం కూడా ఆకట్టుకునేలా

ఈ సినిమాలో చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఓ కేంద్ర మంత్రి రక్షణ బాధ్యతలు చేపట్టే క్రమంలో కుటుంబానికి దూరమవుతాడు. భార్య, పిల్లలతో దూరమైపోయిన ఆ అధికారి మళ్లీ తన కుటుంబాన్ని చేరుకోవడానికి చేసే ప్రయాణమే ఈ సినిమా కథ. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, కుటుంబ విలువలను మేళవించి అనిల్ రావిపూడి ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

మొత్తంగా చూస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ మెగాస్టార్ కెరీర్‌లో మరో సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా, రీజినల్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది.