Chiranjeevi | భుజం సర్జరీపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..ఆ సర్జన్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
Chiranjeevi | మెగా కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు కుటుంబంలో వరుస శుభవార్తలు వినిపిస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అభిమానుల్లో కలిగిన ఆందోళనకు ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊరట చెందుతున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి మంచి విజయాన్ని అందుకోవడం కుటుంబానికి ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టింది.
Chiranjeevi | మెగా కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు కుటుంబంలో వరుస శుభవార్తలు వినిపిస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అభిమానుల్లో కలిగిన ఆందోళనకు ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊరట చెందుతున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి మంచి విజయాన్ని అందుకోవడం కుటుంబానికి ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇదే సమయంలో ఆయన కుమారుడు రామ్ చరణ్‌కి కవలలు పుట్టడం మెగా కుటుంబంలో మరింత సంతోషాన్ని నింపింది. ఈ శుభవార్తల నడుమ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తన వివాహ వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 6న జరగనున్న తన పెళ్లికి సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవి–సురేఖ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఆ ఫోటోల్లో చిరంజీవి ఎడమ చేతికి హ్యాండ్ సపోర్ట్ బెల్ట్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. షూటింగ్ సమయంలో గాయమైందా? లేక ఏదైనా ప్రమాదమా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ చర్చలు పెరుగుతున్న వేళ చిరంజీవి స్వయంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు.తన భుజానికి చిన్న కీ–హోల్ సర్జరీ జరిగినట్లు, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఆర్థోస్కోపీ సర్జరీను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నితిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సాధారణ కార్యకలాపాలు ప్రారంభించానని స్పష్టం చేశారు.
చేతికి పట్టీ ఉన్నప్పటికీ చిరంజీవి అభిమానులను నిరాశపరచలేదు. ఇటీవల ఆయన బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగారు. ఫోటోలకు పోజ్ ఇచ్చే సమయంలో పట్టీని తీసి అభిమానులను సంతోషపరిచారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుటుంబ శుభవార్తల నడుమ చిన్న సర్జరీ నుంచి కోలుకుంటున్న చిరంజీవి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో పూర్తిగా కోలుకుని త్వరలోనే తిరిగి షూటింగ్స్‌లో బిజీ కావాలని కోరుకుంటున్నారు. మొత్తంగా మెగా కుటుంబంలో ఒకేసారి శుభవార్తల వార్తలు, అభిమానుల ప్రేమ కలిసి ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram