USA Nebraska Sinkhole : అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్

అమెరికా నెబ్రాస్కాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు అకస్మాత్తుగా కుంగి భారీ సింక్ హోల్ ఏర్పడింది. అందులో రెండు కార్లు పడిపోయినా డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 26, 2026, 1:48 pm IST
Read Time: 2 mins
USA Nebraska Sinkhole : అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్

విధాత : ఇటీవల చైనాలో రెండు చోట్ల రోడ్లపై అకస్మాత్తుగా భారీ సింక్ హోల్స్ ఏర్పడి జనాన్ని పరుగులెత్తించిన ఘటనలు మరువకముందే తాజాగా అమెరికా రోడ్లపై సింక్ హోల్ ఘటన ప్రయాణికులను బెంబేలెత్తించింది. అమెరికాలోని నెబ్రాస్కాలో రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అందులో రెండు కార్లు పడిపోయాయి.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అనూహ్యంగా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయి భారీ సింక్ హోల్ ఏర్పడింది. రోడ్డుపై ఆగి ఉన్న ఒక ఎస్‌యూవీ కారు, పికప్ ట్రక్ క్షణాల్లో ఉన్న ఫలంగానే భూమిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.

భూగర్భంలో వాటర్ పైపు పగలడం వల్లే రోడ్డు కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Mexican Couple | ప‌డ‌వే వివాహ వేదిక‌.. వార‌ణాసిలో గంగ‌మ్మ సాక్షిగా ఒక్క‌టైన మెక్సికో జంట‌
Yadagirigutta| కమనీయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల కల్యాణం