Site icon vidhaatha

వలకు చిక్కిన అరుదైన సముద్ర పాము.. ఇవి కాటు వేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

విధాత: అరుదైన సముద్ర పాము మత్స్యకారుల వలకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు పది అడుగుల అరుదైన సముద్ర పాము చిక్కింది. ప్రస్తుతం మరబోట్లతో వేట నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారులు సంప్రదాయ వలతో వేట సాగించగా చనిపోయిన సముద్రపాము వలలో చిక్కింది.

దానిని చూసేందుకు గ్రామస్తులు గుంపులుగా తరలివచ్చారు. సముద్రం అడుగున సంచరించే ఈ రకం పాములలో కొన్ని విషపూరిత రకాలుంటే మరికొన్ని సాధారణమైనవని, విషపూరిత సముద్రపు పాములు సాధరణంగా కాటు వేయవని కాటు వేస్తే మాత్రం సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలకు ప్రమాదమని జీవశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Exit mobile version