Youtuber Anvesh : యూ ట్యూబర్ అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు !

యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ కాగా దర్యాప్తు కొనసాగుతోంది.

Youtuber Anvesh

విధాత, హైదరాబాద్ : నా అన్వేషణ పేరుతో ప్రముఖ యూ ట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హిందు దేవుళ్లు, అమ్మాయిల వస్త్ర ధారణపైన, ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావుపైన అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో చేయడంపై నటి కరాటే కల్యాణి, హిందు సంఘాలు పంజాగుట్ట పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన పోలీసులు అన్వేష్ ఇన్ స్ట్రాను బ్లాక్ చేయాలంటూ మెటాను కోరారు. అన్వేష్ అకౌంట్లను పరిశీలించిన మెటా అతని ఇన్ స్ట్రా ఖాతాను బ్లాక్ చేసింది.

అయితే ఆ తర్వాత అన్వేష్ తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియో విడుదల చేసి రెచ్చిపోయాడు. దీనిపై స్పందించిన పోలీసులు అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతడికి ఉన్న మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో పాటు యూ ట్యూబ్ ను కూడా బ్లాక్ చేయాలని పంజాగుట్ట పోలీసులు సంబంధిత సంస్థలకు లేఖ రాశారు. నా అన్వేషణ పేరుతో ప్రపంచ దేశాలలో పర్యటిస్తూ వీడియోలను యూ ట్యూబ్ లలో పోస్టు చేయడం ద్వారా అన్వేష్ గుర్తింపు పొందాడు. అతనికి 1.8 మిలియన్స్ అంటే 13లక్షల ఫాలోవర్స్ ఉండగా..ఇన్ స్ట్రా బ్లాక్ దెబ్బకు వేలల్లోకి పడిపోయింది. తాజాగా అన్వేష్ కు లుక్ అవుట్ నోటీస్ జారీ కాబడిన నేపథ్యంలో అతను దేశం వదిలి పోయే పరిస్థితి లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి :

Delhi Murder Case : ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు పిల్లల హత్య
Bill Gates | ఇద్దరు రష్యన్ మహిళలతో అక్రమ సంబంధాలపై బిల్‌గేట్స్‌ సంచలన వ్యాఖ్యలు

Latest News