మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు

పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వడం సంచలనం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లొంగతీసుకున్నారని, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఎన్ఎస్ 69తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 31, 2026, 12:40 pm IST
Read Time: 2 mins
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు

పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వడం సంచలనం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లొంగతీసుకున్నారని, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఎన్ఎస్ 69తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిల పేరుతో తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని, తనకు తెలియకుండానే వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు చేసింది. తనలాగే తన స్నేహితురాలిని కూడా ఇలాగే మోసం చేశాడని బాధిత యువతి ఆరోపించింది. అయితే యువతి ఫిర్యాదుపై వాస్తవం లేదని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రేగా కాంతారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం.