Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగి పై అత్యాచారయత్నం

హనుమకొండ కలెక్టరేట్‌లో తోటి మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం చేసిన సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌ను కలెక్టర్ స్నేహా శబరీష్ సస్పెండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Oct 13, 2025, 3:09 pm IST
Read Time: 2 mins
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగి పై అత్యాచారయత్నం

విధాత, వరంగల్ ప్రతినిధి : హనుమకొండ కలెక్టరేట్ లో పని చేసే తోటి మహిళా ఉద్యోగి పై మరో ఉద్యోగి అత్యాచారానికి యత్నించారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అత్యాచార యత్నానికి ప్రయత్నించగా బాధితురాలు కామాంధుడి నుంచి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ దారుణ సంఘటన సమాచారం తెలియగానే కలెక్టర్ స్నేహా శబరీష్ స్పందించి అత్యాచార యత్నం చేసిన ఇర్ఫాన్ సోహెల్ ను సస్పెండ్ చేశారు. నిందితుడు కొన్నేళ్లుగా మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన పై పూర్తి విచారణ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.