CPI Srinivas Rao : ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కోరారు.
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలంను నిలిపివేయాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, వాటిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు,సంక్షేమ హాస్టల్స్ కోసం ప్రభుత్వ స్థలాలలో భవనాలను నిర్మించాలని సూచించారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఉద్యమించాలన్నారు. అందుకు వామపక్ష పార్టీలు నడుం బిగించాలని, ప్రజాసంఘాలు, పౌర సంఘాలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం చుక్కయ్య అధ్యక్షత వహించగా
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి ఎన్ హంసారెడ్డి,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నున్నా అప్పారావు, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కె. రాంచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్,జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, ప్రజాసంఘాల నాయకులు నేదునూరి రాజమౌళి, ఏదునూరి వెంకటరాజం, ఎన్. అశోక్ స్టాలిన్, కొట్టెపాక రవి, సీపీఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, టి. ఉప్పలయ్య, కెవిపిఎస్,డివైఎఫ్ఐ నాయకులు డి. తిరుపతి,మంద సంపత్,బానూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Inavolu Mallikarjuna Swamy Jatara : ఐనవోలు జాతరలో పటిష్ట ఏర్పాట్లు
నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram