AITUC | అన్ని రంగాల కార్మికులను కలుపుకొని పోరాటం.. ఏఐటీయూసీ మహాసభలో నాయకుల పిలుపు
కార్మిక హక్కుల సాధన దిశగా భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్ లో ఏఐటీయూసీ 4వ మహాసభలు ఘనంగా జరిగాయి.
విధాత, వేములవాడ :
కార్మిక హక్కుల సాధన దిశగా భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్ లో ఏఐటీయూసీ 4వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహాన్న, సీపీఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించిన నాటి నుండి నేటి వరకు జిల్లాలో రాష్ట్ర, కేంద్ర నాయకుల సహకారంతో ఎన్నో పోరాటాలు చేసి, అనేక విజయాలు, కార్మికులకు సంబంధించిన హామీలను అమలు చేసుకున్నామని నాయకులు తెలిపారు. భవిష్యత్తులో అన్ని రంగాల కార్మిక వర్గాలను కలుపుకొని పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని సాధించేందుకు ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్తు పోరాటాల కోసం ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గం రానున్న 3 సంవత్సరాల పాటు జిల్లాలోని అన్ని రంగాల కార్మికుల కోసం, వారి న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తుందని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం వివరాలు: అధ్యక్షుడు : అజ్జ వేణు. ప్రధాన కార్యదర్శి: కడారి రాములు. కోశాధికారి: బచ్చుపల్లి శంకర్. ఉపాధ్యక్షులు : K. V. అనసూర్య, పందుల మల్లేశం, దుండ్రపెల్లి రవీందర్, వడ్లూరి కేతవ్వ, గాజుల రాధ. సహాయ కార్యదర్శులు: మీసం లక్ష్మన్, గాజుల పోశెట్టి, భూంపెల్లి భూంరెడ్డి, అనవేణి భూదన్న, శ్రీరామ్ నర్సయ్య. వీరితో పాటు కౌన్సిల్ సభ్యులుగా పండుగ పోచమల్లు, ఎల్ల దేవరాజు, కట్కూరి రాజేశ్వరి, ఈసరి దేవయ్య, తాళ్లపెల్లి రాములు, ఎదురుగట్ల మమత, చొప్పరి అంజలి, ఓరుగంటి శ్యామల, కొండికోప్పుల పద్మ, సుంకణపెల్లి శాంత, సామనపెల్లి జ్యోతి, బీరేటి లక్ష్మి, మల్లమారి సుధారాని, సుంకపాక పుష్ప, మండల లీలావతి, ములుగు పద్మ, కన్నం రజిత, నర్సింగోజీ మారుతి, గాజుల వజ్రవ్వ, కుమ్మరి మంగ, కొత్తపెల్లి రవి, డప్పు స్వామి, బర్ర రాజయ్య, మెతుకు లచ్చయ్య, సురువు మొoడయ్య, లింగంపల్లి సుమలత తదితరులను ఎన్నుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram