సింగరేణి ప్రక్షాళనకు ఏఐటీయూసీ పోరాటం: వాసిరెడ్డి సీతారామయ్య
అవినీతిమయమైన సింగరేణిలో ప్రక్షాళన కోసం ఏఐటీయూసీ పోరాడుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: అవినీతిమయమైన సింగరేణిలో ప్రక్షాళన కోసం ఏఐటీయూసీ పోరాడుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని సీఎస్పీ వన్, జీడీకే వన్ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కే స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషంతో కలసి ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పదేళ్లుగా ఉన్న గుర్తింపు సంఘం ట్రేడ్ యూనియన్ గా విఫలమైందని విమర్శించారు. సింగరేణిలో క్లరికల్, ట్రేడ్స్ మెన్ ఖాళీలు భర్తీ కాకుండా వందలాదిగా మిగిలిపోయాయని ఆరోపించారు.
సింగరేణిలో విద్యావంతులైన యువ కార్మికులచే అంతర్గత ఖాళీలు నింపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులతో కఠిన శ్రమను అరికడతామని, కోల్ ఇండియాలో లాగా ఇన్ కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో నాయకులు బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, కన్నం లక్ష్మి నారాయణ, గౌతం గోవర్దన్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, పెరుమాండ్ల రమేష్ గౌడ్, జగదీష్, డీ సాయన్న, బండి మల్లేశ్, బీ సమ్మయ్య, చెరుకు శ్రీనివాస్, జంగ శ్రీనివాస్, పీ రంజిత్ కుమార్, రామగిరి అంకుల్, కే మురళి, రాజమౌళి, విక్రం, వినయ్, పడాల కనకరాజు, బూడిద మల్లేశ్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.