కన్నీరు పెట్టుకున్న సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీ తనపై అనుచిత ఆరోపణలను చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంజాగుట్టలో ఫిర్యాదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని కంటతడి పెట్టుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట నాపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 13, 2026, 4:24 pm IST
Read Time: 3 mins
కన్నీరు పెట్టుకున్న సింగర్ మంగ్లీ

విధాత, హైదరాబాద్: సింగర్ మంగ్లీ తనపై అనుచిత ఆరోపణలను చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంజాగుట్టలో ఫిర్యాదు చేశారు. గత నెల 22న పంజాగుట్టలోని ఓ ఆఫీస్‌లో తనను తాను లాయర్‌గా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొంది. నిజానిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని కంటతడి పెట్టుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట నాపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. ఈ విషయంలో పోరాడడానికి ఎక్కడికైనా రావడానికి సిద్ధం అని తెలిపారు.

కష్టపడి వచ్చిన నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేవలం బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు, ఫేమస్ అయ్యేందుకు సుబ్బారావు అనే అడ్వకేట్ నా పేరును వాడుకుని నాపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని మంగ్లీ ఆరోపించింది. నా ఎదుగుదలకు కారణమైన సోషల్ మీడియా నాకు ఈ రోజు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోణలు ప్రచారం చేయకుండా నాపై దుష్ర్పచారాన్ని ఖండించాలని కోరింది. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపునా పోరాడుతానని, నాకు డబ్బు అంటే ఆశలేదని, పాటలే నా ప్రపంచం అని, అనవసరంగా నా తమ్ముడిపై కూడా ఇందులో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.