Delhi Murder Case : ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు పిల్లల హత్య

న్యూఢిల్లీలో తల్లి, ముగ్గురు చిన్నారులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఘటన అనంతరం భర్త పరారీలో ఉండటంతో అతడిపైనే పోలీసుల అనుమానం వ్యక్తమవుతోంది.

Delhi Samaypur Badli murder

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లీ, ఆమె ముగ్గురు కుమార్తెలు హత్యకు గురయ్యారు. మృతురాలి భర్తే వారిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని సిరాస్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త ముంచన్‌ కెవాత్‌, ముగ్గురు కుమార్తెలతో కలిసి చందన్‌పార్క్‌ ఏరియాలో నివాసం ఉంటున్నారు. కెవాత్‌ నగరంలోని ఆజాద్‌పుర్‌ మండిలో కూరగాయలు విక్రయిస్తుంటాడు. బుధవారం తల్లి, వరుసగా 3నుంచి 5 ఏళ్ల వయసున్న న ఆమె ముగ్గురు చిన్నారులు ఇంట్లో రక్తపుమడుగుల్లో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించగా వారంతా చనిపోయి ఉన్నారు. హంతకుడు పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి.. హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితులంతా నిద్రలో ఉండగానే హంతకుడు వారిని చంపినట్లుగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి మహిళ భర్త పరారీలో ఉండటంతో అతనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టానికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కెవాత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Odisha Mining Officer : ఒడిస్సా విజిలెన్స్ వలకు అతిపెద్ద అవినీతి తిమింగలం!
Rythu Bharosa | రైతు భరోసా ఆలస్యంపై రగిలిపోతున్న రైతాంగం!

Latest News