Rail One app | మార్చి 1 నుంచి రైల్ వన్ యాప్.. యూటీఎస్ యాప్ ఇక ఉండదు

ఇకనుంచి దేశంలో రైల్వే టికెట్ కొనుగోలు, క్యాన్సిలేషన్స్‌, ఎంక్వరీ వంటి సేవలన్నీ ఒకే యాప్‌లో లభ్యం కానున్నాయి. ప్రయాణికులకు మార్చి ఒకటో తేదీ నుంచి రైల్ వన్ యాప్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు వినియోగిస్తున్న యూటీఎస్ యాప్‌ను నిలిపివేయనున్నారు.

all services in single app Rail One app

Rail One app | రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేయాలంటే ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. త్వరలో అందరూ నూతన యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. టికెట్ సంబంధిత సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే విధంగా రైల్ వన్ యాప్ రూపొందించినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

పాస్‌ల రెన్యువల్‌, అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్ ప్రస్తుతం వినియోగంలో ఉంది. అయితే ఈ యాప్ మార్చి 1వ తేదీ నుంచి నిలిచిపోతుంది. డిజిటల్ సర్వీసులు ప్రయాణికులకు సులభంగా ఉపయోగపడేలా, మల్టీ యాప్‌ల నుంచి విముక్తి కల్పించేందుకు రైల్ వన్ యాప్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఒక యాప్ ద్వారా టికెట్ బుకింగ్, మరో యాప్ ద్వారా అన్ రిజర్వుడు, మరో దాంట్లో ఎంక్వరీ సర్వీసులు పొందుతున్నారు. ఇలాంటి సర్వీసులన్నీ ఒకే యాప్ లో లభించే విధంగా నూతన యాప్ మార్చి 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నది.

రైల్ వన్ లో రైళ్ల టికెట్ రిజర్వేషన్, అన్ రిజర్వుడు టికెట్ల కొనుగోలు, ఫ్లాట్ ఫారం టికెట్లు, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేట్, పీఎన్ఆర్ స్టేటస్ సేవలతో పాటు రైల్వే ఇన్ఫర్మేషన్ వంటివి ఇందులో లభ్యమవుతాయి. అప్పుడప్పుడు రైళ్లలో ప్రయాణించేవారితో పాటు నిత్యం రైళ్లలో ప్రయాణించే వారి సౌలభ్యం కోసం దీన్ని రూపొందించారు.

మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ యాప్ పూర్తిగా నిలిచిపోతుందని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందులో ఎలాంటి టికెట్ విక్రయాలు జరగవని కూడా స్పష్టం చేసింది. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రతి ప్రయాణీకుడు రైల్ వన్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడు చేసుకోవాలని కోరింది. గతంలో యూటీఎస్ వినియోగించిన వారు కొత్తగా యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియెట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పాతదాన్నే కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.

ఐ.ఆర్.సీ.టీ.సీ లాగిన్ క్రిడెన్షియల్స్ ను కూడా వాడుకోవచ్చని భారతీయ రైల్వే ప్రకటించింది. రైల్ వన్ యాప్ వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు అన్ రిజర్వుడు టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశం వచ్చే జూలై 14 వరకు అందుబాటులో ఉండనున్నది. యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్ కొనుగోలు కు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది. భారతీయ రైల్వేలో రైల్ వన్ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని యాప్ ల వివరాలతో వస్తున్నది.

Read Also |

Savings Schemes | బ్యాంకు ఎఫ్‌డీల కంటే ఎక్కువ వ‌డ్డీ.. ఈ మూడు స్కీమ్స్ అద్భుతం
AI Data Centers | ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటును రద్దు చేసిన అమెరికా నగరం.. కారణం ఇదే!
Rahul Gandhi | ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు భయపడే.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌.. మోదీకి దమ్ముంటే దాన్ని రద్దు చేయాలి : రాహుల్‌ గాంధీ

Latest News