విధాత : ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ సంస్థలు స్విగ్గీ, అమెజాన్, ఫ్లికార్ట్, బ్లింకెట్ వంటి సంస్థలకు వచ్చే ఆర్డర్స్ ను డెలివరి చేయడంలో డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్స్) పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. భారీ వర్షాలు..వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాల సమయంలోనైనా… విపరీతమైన ఎండ, వాన, చలిలోనైనా… ట్రాఫిక్ సమస్యలోనైనా ఇచ్చిన ఆర్డర్స్ డెలివరి చేయడంతో పగలనకా..రేయనకా వారు బైక్ లపై వెలుతూ పడే కష్టాలు ఈ రోజుల్లో అందరికి తెలిసిందే.
అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఓ డెలివర్ బాయ్ తన భ్లింకిట్ సంస్థకు వచ్చిన ఆర్డర్ ను కస్టమర్ కు అందించేందుకు ఎంచుకున్న మార్గం వైరల్ గా మారింది. సాంప్రదాయ రాజస్థాన్ తలపాగా ధరించిన ఓ వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తూ వీపుపై బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌తో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆధునిక క్విక్-కామర్స్ సేవలు, సంప్రదాయ రవాణా కలగలిసిన అరుదైన దృశ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియో లక్షలాది వీక్షించడం విశేషం.
ఇది చూసిన నెటిజన్లు “ఇది రాజస్థాన్ బ్రో,” అని కొందరు, “పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ డెలివరీ” అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. మరికొందరేమో రాజస్థాన్‌లో గుర్రాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నందున, ఈ దృశ్యం ఆ రాష్ట్ర సంస్కృతికి అద్దం పడుతోందని అని కామెంట్లు పెట్టారు. పెట్రోల్ అవసరం లేదు…ట్రాఫిక్ సమస్యలు దాటవచ్చు.. మారమూల ప్రాంతాలకు కూడా గుర్రం స్వారీపై డెలివరీ చేయవచ్చంటూ ప్రశంసిస్తున్నారు.
ये राजस्थान हैं प्रधान….!!!
युवाओं को घोड़ी चढ़ना नसीब नहीं हो रहा है….
और बुजुर्ग घोड़ों पर ऑनलाइन डिलीवरी कर रहे हैं…😂 pic.twitter.com/uYAzlhxSNY
— kapil bishnoi (@Kapil_Jyani_) February 22, 2026
ఇవి కూడా చదవండి :
Youtuber Anvesh : యూ ట్యూబర్ అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు !
UK First Womb Transplant Birth : వండర్..మరణించిన దాత గర్భాశయంతో సంతానం!
