Raghav Chadha : బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ అవతారమెత్తిన ఎంపీ.. ఇంటింటికీ వెళ్లి వస్తువులు డెలివరీ..

బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన ఎంపీ రాఘవ్ చద్దా! గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వీధుల్లో అర్ధరాత్రి బైక్‌పై వెళ్లి డెలివరీలు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Raghav Chadha : బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ అవతారమెత్తిన ఎంపీ.. ఇంటింటికీ వెళ్లి వస్తువులు డెలివరీ..

నిత్యం అధికారిక కార్యక్రమాలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపే ఓ ఎంపీ అకస్మాత్తుగా డెలివరీ బాయ్‌ (delivery boy)అవతారమెత్తారు. గన్‌మెన్స్‌, సెక్యూరిటీ ఏదీ లేకుండా.. రాత్రిపూట బైక్‌పై వెళ్లి వస్తువులను హోమ్‌ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు ఎంపీ (MP) సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఆ ఎంపీ ఎవరో కాదు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ (AAP MP) రాఘవ్‌ చద్దా (Raghav Chadha). గిగ్‌ వర్కర్ల (Gig Workers) సమస్యలపై గతంలోనూ ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారి సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తారు కూడా. ఇప్పుడు ఏకంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. డెలివరీ భాగస్వాముల కష్టాలు, తక్కువ వేతనం, సామాజిక భద్రత, పని గంటలు వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఆయన డెలివరీ బాయ్‌గా మారినట్లు తెలుస్తోంది.

బ్లింకిట్‌ డెలివరీ ఏజెంట్‌ (Blinkit delivery) డ్రెస్‌ ధరించి.. మరో యువకుడితో కలిసి రాత్రిపూట ఢిల్లీ వీధుల్లోకి వెళ్లారు. యాప్‌లో వచ్చిన ఆర్డర్లను దుకాణం వద్ద కలెక్ట్‌ చేసుకొని వాటిని హోమ్‌ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ వీడియోని రాఘవ్‌ చద్దా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘బోర్డు రూమ్‌లకు దూరంగా.. అట్టడుగు స్థాయిలో’ అంటూ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఫుల్‌ వీడియో పోస్టు చేసే అవకాశం ఉంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :


‘మన శంకర వరప్రసాద్ గారు’ రివ్యూ – సంక్రాంతికి చిరు అందించిన కుటుంబ వినోదం
Mulugu Tourism : అడవి అందాల ఆరబోత….ఆకట్టుకుంటున్న జలగలంచ