హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్‌కు అరుదైన ఆహ్వానం.. మార్చి 27న హర్డర్డ్ స్కూల్ క్యాంపస్‌లో సింపొజియం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు సీఎంకు ఆహ్వాన లేఖను పంపించారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 22, 2026 9:35 PM IST
హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్‌కు అరుదైన ఆహ్వానం.. మార్చి 27న హర్డర్డ్ స్కూల్ క్యాంపస్‌లో సింపొజియం

విధాత, ప్రత్యే క ప్రతినిధి:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు సీఎంకు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం. ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్‌లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమి రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలసీ, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.