Zomato | న్యూఇయ‌ర్‌ను బీట్ చేసిన మ‌ద‌ర్స్ డే.. జొమాటోలో అత్య‌ధిక ఆర్డ‌ర్లు

Zomato | మ‌ద‌ర్స్ డే.. న్యూఇయ‌ర్‌ను బీట్ చేసింది. మ‌దర్స్ డే సంద‌ర్భంగా జొమాటోలో అత్య‌ధిక ఆర్డ‌ర్లు చేసిన‌ట్లు జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ దీపింద‌ర్ గోయ‌ల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ఆర్డ‌ర్లు.. న్యూఇయ‌ర్ రోజు కంటే అత్య‌ధిక‌మ‌ని పేర్కొన్నారు.

మ‌ద‌ర్స్ డే వేడుక‌ల్లో భాగంగా జొమాటో ద్వారా భారీగా ఆర్డ‌ర్లు చేసినందుకు, ఈ వేడుక‌ల్లో మ‌మ్మ‌ల్ని భాగ‌స్వామ్యం చేసేందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. న్యూఇయ‌ర్, ప్రేమికుల రోజుతో పాటు ఇత‌ర పండుగ‌ల సంద‌ర్భంగా త‌మ‌ను ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు దీపింద‌ర్ గోయ‌ల్. మ‌ద‌ర్స్ డేను అంద‌రికీ గుర్తుండిపోయేలా చేసినందుకు జొమాటో, బ్లింకిట్ డెలివ‌రీ పార్ట్‌న‌ర్స్‌కు సీఈవో థ్యాంక్స్ చెప్పారు.

జొమాటో ద్వారా ఫుడ్ ఐటెమ్స్‌కే ప‌రిమితం కాకుండా బ్లింకిట్ ద్వారా ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా భారీగా ఆర్ద‌ర్ చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, స్మార్ట్ వాచ్‌ల‌తో పాటు ఇత‌ర ఐటెమ్స్‌ను భారీగా ఆర్డ‌ర్ చేసిన‌ట్లు సీఈవో తెలిపారు.

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా కంపెనీ ఉద్యోగుల త‌ల్లుల‌ను జొమాటో ఆఫీసుకు పిలిపించి మ‌ద‌ర్స్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు. జొమాటోపై వారి అభిప్రాయాల‌ను స్వీక‌రించిన‌ట్లు సీఈవో గోయ‌ల్ తెలిపారు.