న్యూఢిల్లీ : కూల్చివేస్తున్న బిల్డింగ్ అనూహ్యంగా ఒక్కసారిగా కుప్పకూలిపోగా(Building Collapse)…కూల్చివేత ప్రక్రియను వీడియో తీస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి(Injuries). ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టర్కీలోని కహ్రామన్మరాస్‌లో.. ఫిబ్రవరి 6వ తేదీన వచ్చిన భూకంపంలో అనే భవనాలు(Earthquake Damaged Buildings) దెబ్బతిన్నాయి. దీంతో నివాసానికి ఆమోదయోగ్యంగా లేని ప్రమాదకర భవనాలను అక్కడి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. ఈ క్రమంలోనే ఓ భవనాన్ని క్రేన్‌తో కూలుస్తుండగా.. అకస్మాత్తుగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
కూల్చివేత ప్రక్రియను అక్కడే ఉండి తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు క్రేన్ లో ఉన్న వ్యక్తితో పాటు ఇతర సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ పరిణామంతో కూల్చివేత ప్రక్రియలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టర్కీ ప్రభుత్వం ఆదేశించింది.