Site icon vidhaatha

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు

కర్నూలు,విధాత‌: పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. సి.బెళగల్ మండలం బురాన్‍దొడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.తరగతి గదిలో స్లాబ్ పెచ్చులూడి పడి నలుగురు విద్యార్థులకు గాయాలు. మహిధర్ అనే విద్యార్థి తలకు ఐదు కుట్లు ప‌డ్డాయి. నాడు-నేడు కింద నాసిరకంగా పనులు చేపట్టారంటూ తల్లిదండ్రుల ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మూడ్రోజుల క్రితం ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి తరహా ఘటన జ‌రిగింది. ప్రభుత్వ పాఠశాల స్లాబ్ విరిగిపడడంతో నాలుగో తరగతి విద్యార్థి మృతి. మరో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోవడంతో తప్పిన ప్రమాదం.

Exit mobile version