Celebrity Marriages | సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి.. కోట్ల ఖర్చుతో హాట్ టాపిక్‌గా మారిన మూడు భారీ వివాహాలు

Celebrity Marriages | కొన్నేళ్లుగా ప్రముఖుల పెళ్లిళ్లు కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు ప్రముఖుల పెళ్లిళ్లు భారీ వ్యయంతో వార్తల్లో నిలిచాయి.ఇప్పుడు అదే పంథాలో టాలీవుడ్, క్రీడా రంగాలకు చెందిన మూడు ప్రముఖ వివాహాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Celebrity Marriages | కొన్నేళ్లుగా ప్రముఖుల పెళ్లిళ్లు కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు ప్రముఖుల పెళ్లిళ్లు భారీ వ్యయంతో వార్తల్లో నిలిచాయి.ఇప్పుడు అదే పంథాలో టాలీవుడ్, క్రీడా రంగాలకు చెందిన మూడు ప్రముఖ వివాహాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూడు ఈవెంట్ల కోసం కలిపి దాదాపు రూ.60 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు

ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహం గురించి చెప్పుకోవాలి. ఆయన తన ప్రియురాలు నైనికతో మార్చి 6న వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ పెళ్లి వేడుకలు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ, ముందుగా నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు మాత్రం అత్యంత ఘనంగా జరిగాయి.

మార్చి 2న హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో సినీ ప్రముఖుల కోసం నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ బాష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను అల్లు అరవింద్ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డెకరేషన్, అతిథుల మర్యాదలు, ప్రత్యేక విందులు వంటి ఏర్పాట్లతో ఈ వేడుక కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం వివాహ వేడుకల కోసం రూ.15 నుంచి 20 కోట్ల వరకు వ్యయం అయ్యి ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయ్ దేవరకొండ – రష్మిక రాయల్ వెడ్డింగ్

మరోవైపు టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో అత్యంత వైభవంగా ఈ పెళ్లి జరిగింది. ఈ జంట తమ పెళ్లి కోసం ఖరీదైన ఐటీసీ మెమంటోస్ ఉద‌య్‌పూర్ రిసార్ట్‌ను వేదికగా ఎంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వివాహ వేడుక కోసం దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ వివాహానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ కోసం కూడా కోట్ల రూపాయలు వెచ్చించినట్లు కథనాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుక కూడా భారీగా చర్చనీయాంశమైంది.

అర్జున్ టెండూల్కర్ వివాహం

ఇక క్రీడా రంగంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం కూడా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆయన సానియా చందోక్‌తో మార్చి 5న ముంబై లో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. సౌత్ ముంబైలోని లగ్జరీ హోటల్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ వేడుక జరుగుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖులు హాజరవుతారని సమాచారం. ఈ వివాహ వేడుక కోసం సుమారు రూ.25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

విలాసవంతమైన పెళ్లిళ్ల ట్రెండ్

ఇలా వరుసగా మూడు భారీ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఒకే సమయంలో జరగడం విశేషంగా మారింది. అల్లు శిరీష్ వివాహం, విజయ్–రష్మిక రాయల్ వెడ్డింగ్, అర్జున్ టెండూల్కర్ వివాహం కలిపి చూస్తే దాదాపు రూ.60 కోట్లకు పైగా ఖర్చు ఈ పెళ్లిళ్ల సీజన్‌లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వేదికల ఎంపిక, డిజైనర్ దుస్తులు, భారీ అలంకరణలు, దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన గిఫ్ట్ హ్యాంపర్లు వంటి అంశాలు ఈ ఖర్చును మరింత పెంచుతున్నాయి.

సామాన్య ప్రజలు ఈ భారీ అంకెలను చూసి ఆశ్చర్యపోయినా, తమ అభిమాన తారల పెళ్లి వేడుకలను ఆసక్తిగా ఫాలో అవుతూ ఆనందిస్తున్నారు. మొత్తానికి 2026 పెళ్లిళ్ల సీజన్ భారతీయ సినిమా, క్రీడా రంగాల్లో ఖరీదైన వేడుకలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

Latest News