Sirish Pre wedding Celebrations | సంద‌డిగా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్.. త‌ర‌లివ‌చ్చిన టాలీవుడ్‌

Sirish Pre wedding Celebrations | అల్లు కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ – నయనికల వివాహం మార్చి 6న జరగనుండగా, ముందస్తుగా ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘ‌నంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక టాలీవుడ్ ప్రముఖులతో కళకళలాడింది.

Reported by: Sandeep | సినిమా | Mar 03, 2026, 9:47 am IST
Read Time: 5 mins
Sirish Pre wedding Celebrations | సంద‌డిగా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్.. త‌ర‌లివ‌చ్చిన టాలీవుడ్‌

Sirish Pre wedding Celebrations | అల్లు కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ – నయనికల వివాహం మార్చి 6న జరగనుండగా, ముందస్తుగా ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘ‌నంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక టాలీవుడ్ ప్రముఖులతో కళకళలాడింది. సినీ రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు భారీ సంఖ్యలో హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా విచ్చేసి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు.

అక్కినేని కుటుంబం సందడి

ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో అక్కినేని కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటసమ్రాట్ అక్కినేని నాగార్జున, అమల అక్కినేని, నాగ చైతన్య వేడుకకు హాజరయ్యారు. వారిని అల్లు అరవింద్ ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతులతో నాగార్జున, అమల స్నేహపూర్వకంగా ముచ్చటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా కుటుంబం హాజరు

మెగా కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్, సురేఖ కొణిదెల, సుష్మిత, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు శిరీష్-నయనికలకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం పాల్గొని కాబోయే దంపతులకు ఆశీస్సులు అందజేశారు. దర్శకులలో కె. రాఘవేంద్రరావు, బి. గోపాల్, కోదండ రామిరెడ్డి, సి. అశ్వనీదత్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.

ఈ వేడుకలో రవితేజ, సందీప్ రెడ్డి వంగా, వి.వి. వినాయక్, సుకుమార్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, చందు మొండేటి, మెహర్ రమేష్, మారుతి, బుచ్చిబాబు సానా, అట్లీ, బాసిల్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నటులు రానా దగ్గుబాటి, నాని, గోపీచంద్, శ్రీవిష్ణు, నవీన్ పోలిశెట్టి, వెన్నెల కిశోర్, సునీల్, అలీ, ప్రియదర్శి తదితరులు సందడి చేశారు. సంగీత దర్శకుడు థమన్, గాయకులు, రచయితలు, యాంకర్ సుమ వంటి పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.

రాజకీయ ప్రముఖుల హాజరు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో నిర్మాత బన్నీ వాసు, ఎస్కేఎన్ అతిథులను స్వాగతించి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

అల్లు వారి ఇంట జరిగిన ఈ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మార్చి 6న జరగనున్న శిరీష్-నయనికల వివాహం కూడా అదే రీతిలో ఘనంగా జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.