Andhra Cricket Association | ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం.

andhra-cricket-association-elected-kesineni-sivanath-as-president

Andhra Cricket Association | అమరావతి : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association) అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్)(MP Kesineni Sivanath) ఏకగ్రీవ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్(MP Sana Satish) ఎన్నికవ్వగా…మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షుడిగా చిన్ని రెండోసారి ఎన్నికవ్వడం విశేషం.

గత ఎన్నికల సందర్భంగా కేశినేని చిన్ని ఇచ్చిన హామీలలో ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని, మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోపే సిద్దం చేసి రాజధాని ప్రాంతానికి అందిస్తామన్న హామీలు అసంపూర్తిగా ఉన్నాయి.

మంగళగిరి అంతర్జాతీయ స్టేడియం కట్టి ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని, అలాగే విశాఖపట్నంలో రెండో క్రికెట్ స్టేడియం నిర్మాణంతోపాటు అన్ని జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ దిశగా ఆయన అధ్యక్షుడిగా తన రెండో టర్మ్ లో చర్యలు తీసుకునే అవకాశముందని క్రీడాభినులు ఆశలు పెట్టుకున్నారు.