Mayuree Naaree Ship : భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ దాడి

హర్మూజ్ జలసంధి మీదుగా భారత్ వస్తున్న కార్గో నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతవగా, 20 మంది నావికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు.

Mayuree Naaree ship

విధాత : హర్మూజ్ జలసంధి మీదుగా భారత్ వస్తున్న కార్గో నౌకపై ఇరాన్ దాడి చేసింది. థాయ్‌ జెండాతో ఆ కార్గో నౌక యూఏఈలోని పోర్టు నుంచి బయల్దేరి.. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని రాయల్ థాయ్ నేవీ వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒమన్‌ నౌకాదళం పేర్కొంది. ఆ కార్గోషిప్‌లోని 20 మంది నావికుల్ని రక్షించినట్లుగా తెలిపింది.

దాడికి గురైన కార్గో నౌక థాయ్‌లాండ్‌లోని షిప్పింగ్‌ కంపెనీకి చెందిన మయూరీ నారీగా గుర్తించారు. నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని ఖలిఫా పోర్ట్ నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్‌కు బయల్దేరింది. హర్మూజ్‌ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాడికి గురైంది. దాడి తీవ్రత కారణంగా నౌక నుంచి దట్టమైన పొగ వెలువడుతోన్న దృశ్యాలను రాయల్ థాయ్‌ నేవీ విడుదల చేసింది. ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నాం అని వెల్లడించింది. ఈ దాడి ఇరాన్ దళాలు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి :

Ayodhya : వంట గ్యాస్ ఎఫెక్ట్.. అయోధ్య భక్తులకు నిత్యాన్నదానం నిలిపివేత !
అతి తక్కువ ఆయుష్షు ఉన్న జీవులు ఇవే..! కొన్ని గంటల్లోనే చనిపోతాయి.

Latest News