అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?

2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల తాజా పోల్స్‌లో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌కు విశేష ప్రజాదరణ లభించింది. దీంతో అమెరికా రాజకీయాల్లో యువ నాయకత్వానికి ఆదరణ పెరుగుతోందన్న చర్చ ప్రారంభమైంది.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jul 24, 2026, 3:41 pm IST
Read Time: 6 mins
అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?

అమెరికా రాజకీయాల్లో యువ నాయకత్వానికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2028 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తాజా పోల్స్‌లో 36 ఏళ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌కు విశేష ప్రజాదరణ లభిస్తుండటం ఆసక్తి రేపుతుంది. ఒకాసియో-కోర్టెజ్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూస్తే.. అమెరికా రాజకీయాలు వృద్ధ నాయకత్వం నుంచి యువ నాయకత్వం వైపు మలుపు తిరుగుతున్నాయన్న చర్చను తెరపైకి తెచ్చాయి. కొన్నాళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా డోనాల్డ్ ట్రంప్, బైడెన్, ట్రంప్, హిల్లరి క్లింటన్, కమలా హారీస్ వంటి వయసు మీరిన నాయకులను చూస్తూ వస్తున్న అమెరికన్లు … దేశానికి రానున్న రోజుల్లో యువ నాయకత్వం వస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారని తాజా పోల్ సర్వేల సరళీ వెల్లడిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌కు రెడీ?

2028 అధ్యక్ష ఎన్నికల తొలి ప్రైమరీ న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో తాను ముందంజలో ఉండటం పట్ల అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ‘ది ఇండిపెండెంట్’ ఆమెను కలిసిన సందర్భంలో 2028లో వైట్ హౌస్(అమెరికా అధ్యక్ష పదవి) కోసం పోటీపడుతున్నారా అన్ని ప్రశ్నించగా …అమె అందుకు అవకాశం లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. “ఇందులో రెండు విషయాలు ఉన్నాయని వాటిలో ఒకటి ,ప్రజాభిప్రాయ సేకరణలు (polls) వేరు, అసలైన ఎన్నికల పోటీ వేరు అని ఆమె అన్నారు. తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పోల్స్ లో తనను ఆదరించిన ప్రజల పట్ల నేను ఎంతో వినమ్రతతో కూడిన కృతజ్ఞతను కలిగి ఉన్నానని తెలిపారు. ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో డెమోక్రాట్లు తిరిగి మెజారిటీని సాధించేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఒకాసియో-కోర్టెజ్ చెప్పారు.

ప్రస్తుతం నా ప్రధాన దృష్టి అంతా మధ్యంతర ఎన్నికలపైనే ఉంది అని, కచ్చితంగా డెమోక్రాట్లు ఆ మెజారిటీని సాధించేలా చూసుకోవాలి అని ఆమె చెప్పుకొచ్చారు. తనను తాను డెమోక్రటిక్ సోషలిస్ట్ కాంగ్రెస్ మహిళగా అభివర్ణించుకున్న అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ కు 22 శాతం మంది ఓటు వేసేందుకు మద్దతు తెలిపారు. 21 శాతం మంది బైడెన్ రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్‌ను ఇష్టపడుతున్నారు. అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ 9 శాతంతో మూడవ స్థానంలో ఉండగా, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ 8 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచారు.

కొంతమంది డెమోక్రాట్లు.. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ 2028లో అధ్యక్ష పదవికి గానీ, లేదా ఎక్కువగా సెనేట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ స్థానానికి గానీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. రిపబ్లికన్ల పక్షంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ప్రైమరీలో ఓటు వేయబోయే వారిలో 36 శాతం మంది వాన్స్‌ను, 26 శాతం మంది రూబియోను ఎంచుకోవడం గమనార్హం. రూబియో దశాబ్దం క్రితం అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే అప్పటి న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీతో జరిగిన చర్చలో పేలవమైన ప్రదర్శన తర్వాత చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయారు.