Ayodhya : వంట గ్యాస్ ఎఫెక్ట్.. అయోధ్య భక్తులకు నిత్యాన్నదానం నిలిపివేత !

వంట గ్యాస్ కొరత కారణంగా అయోధ్యలో భక్తులకు అందించే 'రామ్ రసోయ్' నిత్యాన్నదానం నిలిపివేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చివరకు దేవాలయాల సేవలకు కూడా తాకింది.

Ayodhya : వంట గ్యాస్ ఎఫెక్ట్.. అయోధ్య భక్తులకు నిత్యాన్నదానం నిలిపివేత !

విధాత : పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా నెలకొన్న వంట గ్యాస్ సిలిండర్ల కొరత చివరకు అయోధ్య రామమందిరం సందర్శించే భక్తులకు కూడా తాకింది. తగినంత వంట గ్యాస్ సరఫరా లేకపోవడంతో రామ మందిరం సమీపంలోని అమావా ఆలయంలో రామ మందిర్ సందర్శించే భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదానం నిలిపివేశారు. అమావా ఆలయంలో పట్నాకు చెందిన మహావీర్ మందిర్ ట్రస్ట్ నిర్శహిస్తున్న రామ్ రసోయ్ సంస్థ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు రుచికరమైన భోజనం అందుతుంది. అకస్మాత్తుగా సేవలు నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారుఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దంతో పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులలో ఎదురైన సమస్యలతో భారత్ లో వంట గ్యాస్ కొరత సమస్య ఏర్పడింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ సైతం మూతపడటం, పరిమిత వంటకాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చివరకు దేవాలయాలు సైతం ఎల్పీజీ కొరత బాధిత జాబితాల్లో చేరిపోయాయి.

అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి రామ్ రసోయ్ సంస్థ నిత్యం అన్న ప్రసాదం అందిస్తుంది. వంట గ్యాస్ కొరత కారణంగా అన్నదాన ప్రసాదం నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. గ్యాస్ ఏజెన్సీల నుంచి సకాలంలో సిలిండర్లు సరఫరా కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ట్రస్ట్ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ వెల్లడించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నామని..త్వరలోనే నిత్యన్నదానం పునరుద్దరిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులకు సమాచారం కోసం ఆలయ పరిసరాల్లో నోటీస్ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి :

ఎల్పీజీ ఎఫెక్ట్.. ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం!
Bike Taxi | మహారాష్ట్రలో ఉబెర్‌, రాపిడో, ఓలా బైక్‌ సర్వీసులపై నిషేధం.. తెలంగాణలో?