అయోధ్యలో 200 ఏళ్ల నాటి రామాయణ రాతప్రతులు

అయోధ్యలో 200 ఏళ్ల నాటి అరుదైన రామాయణ తాళపత్ర రాతప్రతులు వెలుగుచూశాయి. దేవనాగరి లిపిలో రాసిన ఈ గ్రంథాన్ని సంగ్రహాలయానికి అప్పగించనున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Apr 04, 2026, 8:08 pm IST
Read Time: 4 mins
అయోధ్యలో 200 ఏళ్ల నాటి రామాయణ రాతప్రతులు

విధాత : ఉత్తర ప్రదేశ్ లోని రామజన్మభూమి అయోధ్యలో 200ఏళ్ల క్రితం నాటి అరుతైన రామాయణ రాత ప్రతులు వెలుగుచూడటం ఆసక్తి రేపింది. అయోధ్యలోని జగ్జీత్ సింగ్ అనే వ్యక్తి నివాసంలో 200 ఏళ్ల నాటి అరుదైన రామాయణ తాళ పత్ర గ్రంథం లభ్యమైంది. ప్రస్తుతం ఈ రాతప్రతులు సున్నితంగా మారి.. ముట్టుకుంటే చినిగిపోయే స్థితికి చేరుకున్నాయి.

దేవనాగరి లిపిలో, సహజసిద్ధమైన సిరాతో రాసిన ఈ అపురూప రాత ప్రతుల గ్రంథాన్ని భద్రపరచడం కోసం శ్రీరామకథా సంగ్రహాలయానికి అప్పగించనున్నారు. 200 ఏళ్ల క్రితం వాడిన సహజసిద్ధమైన కాగితం, చెట్ల వేర్ల నుంచి తయారుచేసిన ప్రత్యేకమైన నల్లని సిరాను ఈ రాతప్రతుల్లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. తన తాత క్రమం తప్పకుండా ఈ పుస్తకాన్ని పారాయణం చేసేవారని, తనకు ఇది పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని జగ్జీత్‌ తెలిపారు.

మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు ఎన్నో పోరాటాలు చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం, ఉద్యమాల తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు అక్కడ బాలరాముడి విగ్రహంతో కూడిన అద్బుతమైన దివ్య భవ్య రామమందిరం నిర్మాణం జరుగుగా.. దేశ విదేశాల నుంచి భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ !
చక్కటి కలలతో సుఖవంతమైన నిద్ర.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు