ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ !

అమరావతి రాజధాని పేరుతో ఏపీ కొత్త మ్యాప్ విడుదలైంది. 28 జిల్లాలతో తాజా భౌగోళిక మార్పులను ప్రతిబింబిస్తూ విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ !

విధాత, హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్‌ ను ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కొత్త మ్యాప్ విడుదల చేశారు. గతంలో 26 జిల్లాలు ఉండగా.. ఇటీవల కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలతో కలిపి జిల్లాల సంఖ్య 28 కి చేరింది. .ఈ రెండు కొత్త జిల్లాలను కూడా తాజా మ్యాప్‌లో చేర్చడంతో పాటు రాజధానిగా అమరావతిని చూపుతూ రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలోని వచ్చిన మార్పులను ప్రతిబింభించేలా కొత్త మ్యాప్ విడుదల చేశారు. కొత్త మ్యాప్ విడుదలతో రాష్ట్ర పరిపాలన సౌలభ్యానికి, భవిష్యత్ ప్రణాళికలకు మార్గదర్శకంగా నిలవనుంది.

అయితే రాష్ట్రపతి సంతకంతో కూడిన ఆమోదం..గెజిట్ నోటిఫికేషన్ వెలువడకముందే ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ విడుదల కావడం చర్చనీయాంశమైంది. మరోవైపు రాష్ట్ర రాజధాని నగరంగా మారబోతున్న అమరావతికి తపాలాశాఖ పిన్ కోడ్ కేటాయించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు – 2026కు పార్లెమెంట్‌లో ఆమోదం తర్వాత ఇది కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. భారత తపాలా శాఖ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగా అధికారికంగా గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నారు. అమరావతిలో పోస్టాఫీస్ తో పాటు.. పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది.

ఇవి కూడా చదవండి :

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు …తెలంగాణలో సెలవు దినాలు!
ఆర్ఎస్ కే దక్కిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు!