ఆర్ఎస్ కే దక్కిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు!
ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల చైర్మన్ పదవులు బీఆర్ఎస్ కైవసం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.
విధాత, హైదరాబాద్ : గతంలో పలు వివాదాలతో వాయిదా పడిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాల్టీల చైర్మన్ పదవులు బీఆర్ఎస్ గెలుచుకుంది. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో ఇబ్రహీం పట్నం చైర్ పర్సన్ గా పార్టీ అభ్యర్థి టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు. ఛైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్‌ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా, 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్‌ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడ చైర్మన్ సీటును కాంగ్రెస్ చేజిక్కుంచుకునేలా చేసిన ప్రయత్నాలతో రేగిన వివాదంతో ఎన్నిక వాయిదా పడింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను నిర్వహించారు. బీఆర్ఎస్, సీపీఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నికకు హాజరయ్యారు. ఇక కోరం ఉండటంతో ఎన్నిక ప్రక్రియను సజావుగా కొనసాగించారు.
కాగా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాల్టీలు బీఆర్ఎస్ వశం కావడంతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి, మంచిర్యాల జిల్లా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ వివేక్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నిక నిబంధనల మేరకు జరుగలేదని, దీనిపై కోర్టుకు వెలుతామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే కోరం లేకపోవడంతో రెండుసార్లు వాయిదా పడిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరును అధికారులు ప్రకటించగా..ఏడుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. తమకు సైతం ఏడుగురు మద్దతు తెలిపారని అధికారులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు వాగ్వాదాని దిగారు. దీంతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు.
12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ , బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు ఉండగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఓటుతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది. ఈ క్లిష్టమైన సమీకరణాల మధ్య చెలరేగిన గొడవల కారణంగా ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి :
Dacoit | ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ .. ప్రేమ, ద్రోహం, క్రైమ్‌తో అడివి శేష్ కొత్త ప్రయోDacoit | గం
మూసీపై నా పిటీషన్ డిస్పోజ్ మాత్రమే : బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram