Impleaded Petition Filed In HC On BC Reservations | బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు
42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు మద్దతుగా వి.హనుమంత రావు, ఆర్. కృష్ణయ్య, చిరంజీవులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.

విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈనెల 8న విచారణ కొనసాగనున్న నేపథ్యంలో ఈ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా తమ వాదన వినిపించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
అటు బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతునిచ్చిన బీఆర్ఎస్, బీజేపీలు కూడా హై కోర్టులో కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్లకు అంతా మద్దతునివ్వాలని అభ్యర్థించారు.