• Telugu News
  • /National

Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఉగాది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రామ మందిరాన్ని సందర్శించి బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనామ యంత్ర ప్రతిష్టలో కూడా పాల్గొన్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 19, 2026, 3:18 pm IST
Read Time: 2 mins
Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విధాత : ఉగాది పర్వదినం వేళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ముర్ము రామ మందిరంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయ రెండో అంతస్తులో “రామ నామ యంత్రం ” ప్రతిష్టాపనోత్సవంలో పాల్గొని పూజించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు.

రామ జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో 2023 జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత ఏడాడి 2024 మే 1న రాష్ట్రపతి ముర్ము రామాలయాన్ని తొలిసారిగా సందర్శించారు. మరోసారి ఉగాది పర్వదినం సందర్బంగా గురువారం అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన రాష్ట్రపతి ముర్ము బాలరాముడికి పూజలు చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి :

ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం
Kalvakuntla Kavitha| కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్