Kalvakuntla Kavitha| కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్

కొత్త పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 19, 2026, 1:15 pm IST
Read Time: 2 mins
Kalvakuntla Kavitha| కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్

విధాత : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

గతంలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కవిత ఎన్నికల సంఘానికి చేసిన దరఖాస్తులో లోపాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో సాంకేతిక లోపాలన్నీ సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుమతుల విషయంలో జాప్యం చేస్తుండటంతో కవిత హైకోర్టును ఆశ్రయించింది . విచారణ సందర్భంగా కవిత కొత్త పార్టీ దరఖాస్తు అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పడంతో…అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కోర్టు విచారణ ముగించింది.