Gold, Silver Price Drop | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఉగాది పర్వదినాన పసిడి, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల బంగారం రూ.2,780 తగ్గి రూ.1,54,640 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.2,550 తగ్గి రూ.1,41,750 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.10,000 తగ్గి రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : ఉగాది పర్వదినాన పసిడి, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. బంగారం, వెండి ధరలు మరోసారి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ఉగాదికి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల బంగారం రూ.2,780 తగ్గి రూ.1,54,640 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.2,550 తగ్గి రూ.1,41,750 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.10,000 తగ్గి రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది.
గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర రాజకీయ, ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దం బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్దంతో డాలర్ విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు డాలర్ మీదకు తమ పెట్టుబడులను మళ్లించడంతో బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దీర్ఘకాలంలో మరోసారి బంగారం, వెండి ధరలు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!
Allu Arjun | ‘ధురంధర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం.. “భారతీయ కథకు అంతర్జాతీయ స్వ్యాగ్” అంటూ ట్వీట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram