IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!

IRCTC Kerala Tour | ఈ వేసవిలో కేరళ అందాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.15 వేలలోనే మున్నార్ పర్వతాలు, అలప్పి, కుమారకోం బ్యాక్‌వాటర్స్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించింది.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 18, 2026, 11:58 pm IST
Read Time: 7 mins
IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!

IRCTC Kerala Tour | వేసవి సెలవుల్లో ప్రకృతి అందాలు చూస్తూ.. గ్రీన్‌హిల్స్, ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్ మధ్య రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! హైదరాబాద్ (Hyderabad) నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ (Kerala Hills & Water ) పేరుతో ప్రతి మంగళవారం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. దీనిలో భాగంగా రూ.15 వేలలోనే మున్నార్ పర్వతాలు, అలప్పి, కుమారకోం బ్యాక్‌వాటర్స్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది.

టూర్ వివరాలు

ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ తర్వాత నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్ ఉంది. జర్నీ అనంతరం మళ్లీ అదే స్టాప్‌ల్లో దిగొచ్చు.

టూర్ తేదీలు

ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ కంఫర్ట్ (3టైర్ ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) విభాగాలుగా చార్జ్ చేస్తుంది. ప్రస్తుతానికి మార్చి 31, ఏప్రిల్ 7, 14, 21, 28వ తేదీల్లో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్‌లో విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.32,240 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.18,970; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.16,440 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.10,550; బెడ్ లేకుండా అయితే రూ.8,150 చార్జ్ చేస్తుంది.

స్టాండర్డ్ విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.32,730 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.17,720; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.15,060 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.9,270; బెడ్ లేకుండా అయితే రూ.6,560 చార్జ్ చేస్తుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 20629)‌లో బయల్దేరుతుంది. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.

రెండో రోజు: ఉదయం 11.30 గంటలకు ఆలువా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ వెళ్తారు. మున్నార్‌లో ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఫ్రెషప్ అయిన తర్వాత మున్నార్ పట్టణంలోని పలు ప్రదేశాలను సందర్శింస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

మూడో రోజు: ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్‌ను సందర్శిస్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్‌ను సందర్శనకు వెళ్తారు. రాత్రికి మున్నార్‌లోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: మున్నార్ నుంచి అలెప్పీ/కుమారకోమ్‌కు బయల్దేరతారు. అక్కడ హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు మొత్తం అక్కడే ఎంజాయ్ చేస్తారు. కావాలంటే బ్యాక్‌వాటర్స్‌లో బోటింగ్ చేయవచ్చు.

ఐదో రోజు: అలెప్పీ నుంచి బయల్దేరి ఎర్నాకుళం వెళ్తారు. అక్కడి రైల్వే స్టేషన్‌లో ఉదయం 11.15 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్.20630)లో హైదరాబాద్‌కు బయల్దేరతారు. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.

ఆరో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* రైలు టికెట్లు
* బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి మూడు రోజులకు హోటల్ వసతి
* లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఏసీ వాహన సదుపాయం
* సైట్ సీయింగ్
* టోల్, పన్నులు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం
* ట్రైన్‌లో భోజనం
* ఎంట్రీ టికెట్లు
* బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్
* టూర్ గైడ్
* వ్యక్తిగత ఖర్చులు

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ

IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!