ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం
ఉగాది రోజున సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రూ.55.63 కోట్లను 6,787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు.
అమరావతి : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున ఏపీ సీఎం చంద్రబాబు పేదలకు ఆర్థిక సాయం చేసే అందించే సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. 6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నిధులు విడుదలకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ ఓసి కింద రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లుగా ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు. 21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 1లక్షా 36 వేల 240 మందికి సాయం అందించామని, రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నామన్నారు.
ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అందించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదికపై జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు ఉగాది పచ్చడి స్వీకరించారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళా రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను ప్రధానోత్సవం చేశారు. లబ్ద ప్రతిష్టులైన కళాకారులకు హంస జ్ఞాపికలను అందించిన చంద్రబాబు వారికి అభినందనలు తెలిపారు. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు.
వేడుకల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
AP Job Calendar 2026 : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
Overseas Jobs | ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram