Overseas Jobs | ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!

Overseas Jobs | విరాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ (TOMCOM) ద్వారా ఒమన్‌(Oman)లో భారీ జీతంతో ఉద్యోగాల నియామకం చేపడుతున్నారు. స్టడీస్ & డెలివరీ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.20 లక్షలపైనే జీతం ఇవ్వనున్నారు.

Overseas Jobs | ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!

Overseas Jobs | విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ (TOMCOM) ద్వారా ఒమన్‌(Oman)లో భారీ జీతంతో ఉద్యోగాల నియామకం చేపడుతున్నారు. స్టడీస్ & డెలివరీ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా అనుభవం ఉన్న ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఇది అరుదైన అవకాశమని టామ్‌కమ్ తెలిపింది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.20 లక్షలపైనే జీతం ఇస్తారని వెల్లడించింది.

అర్హతలు

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.

* మైనింగ్/మెకానికల్/సివిల్/ప్రాసెస్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్స్ లేదా మాస్టర్స్
* ఎంబీఏ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం
* కనీసం 15 సంవత్సరాల అనుభవం
* వయసు 30 నుంచి 58 సంవత్సరాల లోపు ఉండాలి
* హిందీ, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి.

బాధ్యతలు

ఈ పోస్టుకు ఎంపికైన వారు..

* అకడమిక్, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లకు నాయకత్వం వహించాలి.
* కోర్సులు, వర్క్‌షాప్‌ల నిర్వహణ చేయాలి.
* ఫ్యాకల్టీ, ట్రైనర్లను పర్యవేక్షించాలి.
* నాణ్యత ప్రమాణాలను మెయింటైన్ చేయాలి.
* సిలబస్ అభివృద్ధితో పాటు ఫలితాలను విశ్లేషించాలి.

దరఖాస్తు విధానం

అన్ని అర్హతలు గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాలని టామ్‌కమ్ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Read More :