Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో భారీ ఉద్యోగాలు.. టామ్‌కమ్ ద్వారా భర్తీ!

Overseas Jobs | విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ (TOMCOM) శుభవార్త తెలిపింది. ఇజ్రాయెల్‌లో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ గివర్స్ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

Reported by: Chandram | విద్య - ఉద్యోగం | Jun 04, 2026, 8:07 pm IST
Read Time: 3 mins
Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో భారీ ఉద్యోగాలు.. టామ్‌కమ్ ద్వారా భర్తీ!

Overseas Jobs | విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ (TOMCOM) శుభవార్త తెలిపింది. ఇజ్రాయెల్‌లో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ గివర్స్ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.99లక్షలకు పైగా వేతనం లభిస్తుందని వెల్లడించింది. విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కోరుకునే నర్సింగ్, పేషెంట్ కేర్ రంగానికి చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కమ్ ప్రతినిధులు సూచిస్తున్నారు.

ఉద్యోగ బాధ్యతలు:

వృద్ధుల సంరక్షణ భాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, సమయానికి మందులు ఇవ్వడం, వ్యక్తిగత పరిశుభ్రతలో సహాయం చేయడం, అవసరమైతే ప్రాథిమ వైద్య సంరక్షణ అందించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

అర్హతలు

* ఏఎన్‌ఎం/జీఎన్ఎం
* ఎంపీహెచ్‌డబ్ల్యూ/ఎంపీహెచ్‌ఏ
* పేషెంట్ కేర్ డిప్లొమో లేదా బీఎస్సీ నర్సింగ్
* ఇంగ్లీష్‌లో ఇంటర్మీడియట్ స్థాయి (CEFR B2) కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండాలి.

ఇతర నిబంధనలు

* కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
* సంబంధిత అనుభవ ధృవపత్రం తప్పనిసరి.
* ఇజ్రాయెల్ వీసా నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్‌నెస్ అవసరం.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1.99లక్షలకు పైగా వేతనం అందిస్తారు. అయితే వసతి, ఆహార ఖర్చులు వర్తిస్తాయిని టామ్‌కమ్ అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పైన ఇమేజ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా గూగుల్ డాక్యుమెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే tomcom.resume@gmail.com మెయిల్ అడ్రస్‌కు సీవీ పంపించవచ్చు. మరిన్ని వివరాలకు 94400 51763, 94400 49645, 94400 52081, 98496 39539 సంప్రదించాలని సూచించారు.